- Advertisement -
- – పుప్పాల నర్సమ్మ వర్ధంతి సందర్భంగా ఏరియా ఆస్పత్రిలో అల్పాహారం పంపిణీ
- నవతెలంగాణ – మిర్యాలగూడ
- తమ కుటుంబ సభ్యుల పేరు మీద నిరుపేదలకు సహాయం చేయాలనే సేవాభావాన్ని కలిగి ఉండటం అభినందనీయమని మిర్యాలగూడ రూరల్ సీఐ నాగ దుర్గాప్రసాద్ తెలిపారు. పుప్పాల నర్సమ్మ వర్ధంతిని పురస్కరించుకొని ఆమె కుమారుడు పుప్పాల సత్యం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని 150 మందికి అల్పాహారాన్ని అందించేందుకు ముందుకు రాగా, వారికి రూరల్ సీఐ నాగ దుర్గాప్రసాద్ అందించి మాట్లాడారు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వివిధ కారణాలతో వచ్చే వారందరూ నిరుపేదలని వారికి చేయూత ఇవ్వడానికి పుప్పాల సత్యం ముందుకు రావడం అభినందనీయమన్నారు.
- ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని కలిగి ఉండి తమకు చేతనైనంతగా పదిమందికి సహాయపడటం వల్ల మంచి సమాజం ఆవిర్భవిస్తుందన్నారు. ఉన్నవారు లేనివారు అనే భేదాభిప్రాయం లేకుండా సమసమాజ స్థాపనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని అందులో భాగంగా లయన్స్ క్లబ్ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బియ్యం నాయుడు, కార్యదర్శి కూటాల రాంబాబు, ఎన్ని గంటల లింగయ్య, భాస్కర క్లబ్ సీనియర్ లయన్స్ లీడర్స్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు, కోల సైదులు, వెంకటేశం, పుప్పాల యాదగిరి తదితరులు ఉన్నారు.
- Advertisement -



