Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మానవ అక్రమ రవాణ నిర్ములించడం మన అందరి బాధ్యత..

మానవ అక్రమ రవాణ నిర్ములించడం మన అందరి బాధ్యత..

- Advertisement -

ఇంచార్జి ఏఎంఓ కిరణ్..
నవతెలంగాణ – తిమ్మాజిపేట

మనుషుల అక్రమ రవాణా నిర్ములనలో ప్రజలు అందరు భాగస్వామ్యం అయినప్పుడే దీనిని సమూలంగా నివారించవచ్చు అని ఇంచార్జి ఏఎంఓ కిరణ్ అన్నారు. ప్రజ్వల స్వచ్చంద సంస్థ, అలాగే రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో వున్నా జడ్.పి.హెచ్.ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ నిర్వహించారు ఈ సందర్భంగా ఇంచార్జ్ ఏఎంఓ కిరణ్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అనేది  ప్రపంచం వ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తూ ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న నేరపూరితమైన చర్య దీనికి పేద మధ్య తరగతి అమ్మాయిలు, మహిళలు ఎక్కువ గా గురి అవుతున్నారు. సమాజంలో ప్రజలతో, విద్యార్థులతో సన్నిహితంగా ఉండి గమనించి వారికి అవగాహనా కల్పించాలి, ముఖ్యంగా పాఠశాలలో  పేరెంట్స్ మీటింగ్స్ లో వారికి అవగాహనా కల్పించాలి.

సైబర్ ట్రాఫికింగ్ అనేది చాలా వేగంగా విస్తరిస్తున్న జఠిలమైన సమస్య కాబట్టి పిల్లలకు ఫోన్ ఉపయోగించడం ద్వారా వచ్చే నష్టాలను తెలియజేయాలి అని అన్నారు. సమాజంలో ఉన్న చాలా సమస్యలకు ఆర్థిక కారణలా తో పాటు, సామజిక కారణాలు దోహదం చేస్తాయి, మన చుట్టుపక్కల ఉండే ఇలాంటి వాళ్ళను ట్రాఫికెర్స్ టార్గెట్ చేసి, మాయమాటలు, ఉద్యోగం, సినిమా అవకాశం అంటూ పట్టణాలకు తీసుకెళ్లి వ్యభిచార గృహాలలో అమ్ముతున్నారు, కాబట్టి మన జిల్లా నుండి గ్రామ స్థాయి వరకు అందరు అవగాహనా కలిగి ఉండి, అప్రమత్తం చేయడం ద్వారా దీన్ని నిర్మూలించవచ్చు. అలాగే అసిస్టెంట్ కోఆర్డినేటర్ ప్రజ్వల ఎన్జీవో మిథాలీ రాజ్  మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను ఆదిలోనే అడ్డుకుంటే మన ఆడపిల్లలను రక్షించు కోవచ్చు ప్రతి రోజు ఎంతో మంది అమ్మాయిలు, మహిళలు దీని బారిన పడుతున్నారు. ముఖ్యంగా యువత, పిల్లలు ఆకర్షణకు గురి గురై పట్టణాలకు వచ్చి వ్యభిచార గృహాలలో అమ్మ బడుతున్నారు.

ప్రజ్వల సంస్థ ద్వారా ఇప్పటి వరకు 30,500 వేల మంది అమ్మాయిలను మహిళలను కాపాడడం జరిగింది. ఇందులో చిన్న పిల్లలు, యువతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సైబర్ ట్రాఫికింగ్ ద్వారా ఈ అక్రమ రవాణా చాలా పెరిగి పోయింది, ముఖ్యంగా విద్యార్థులు అనవసరం అయినా ఆప్స్ ద్వారా పర్సనల్ ఫొటోస్ వీడియోస్ పంపడం ద్వారా సెక్స్ ట్రాఫికింగ్ కి గురి అవుతున్నారు. మీరు జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ఉన్న మన సిబ్బంది ఈ విషయాలపై అవగాహనా పొంది ఇతరులకు అవగాహనా కల్పించాలని సూచించారు. ఈ శిక్షణలో మానవ అక్రమ రవాణా, లైంగిక వ్యాపారం ఎలా జరుగుతుంది, బాధితురాలి పైన ఉండే ప్రభావాలు, సైబర్ అధారిత అక్రమ రవాణా, చట్టాలు బిఎన్ఎస్, ఐటిపిఏ, పిఓసిఎస్ఓ, పిసిఎంఎ జెజె యాక్ట్, సఖి, భరోసా, చైల్డ్ లైన్, పోలీస్ టోల్ ఫ్రీ నంబర్స్ 1098, 100, 181, 1930, 181 ల గురించి వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అసిస్టెంట్ కోఆర్డినేటర్  మిథాలి రాజ్, శ్రీలత, చెన్న కేశ్వరి, నాగర్ కర్నూల్ జిల్లా స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -