Tuesday, March 24, 2026
E-PAPER
Homeసినిమామెగాస్టార్‌ సినిమాకి సంగీతం అందించాలన్నది నా డ్రీమ్‌

మెగాస్టార్‌ సినిమాకి సంగీతం అందించాలన్నది నా డ్రీమ్‌

- Advertisement -

మ్యూజిక్‌ డైరెక్టర్‌ మార్క్‌ కె రాబిన్‌.. తన 8 ఏళ్ల సంగీత ప్రస్థానంలో ఇరవైకి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు. తాజాగా ‘దండోరా’ సినిమాకు బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్‌ను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా మార్క్‌.కె.రాబిన్‌ మీడియాతో ముచ్చటించారు. ‘దండోరా’ సినిమాకు బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా గద్దర్‌ అవార్డ్‌ దక్కడం సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు మరింత మంచి మ్యూజిక్‌ ఇచ్చేందుకు ఒక స్ఫూర్తిగా ఈ అవార్డ్‌ నిలుస్తుందని నమ్ముతున్నాను. ఈ అవార్డ్‌తో నాపై మరింత బాధ్యత పెరిగింది.

డైరెక్టర్‌ మురళీ చెప్పిన కథాంశమే నన్ను మంచి మ్యూజిక్‌ ఇచ్చేందుకు స్ఫూర్తినిచ్చింది. భావోద్వేగం నిండిన మనసుతోనే ‘దండోరా’ సినిమాకు సంగీతాన్ని అందించాను. ఈ సినిమాలో స్థానిక వాయిద్యాలతో సంగీతం కంపోజ్‌ చేశాను. లిరిసిస్ట్‌ కృష్ణకాంత్‌ నాకు మంచి మిత్రుడు. కృష్ణకాంత్‌, ప్రశాంత్‌ వర్మ, నేను కలుస్తుండేవాళ్లం. ప్రశాంత్‌, నేను కలిసి ‘డైలాగ్‌ ఇన్‌ ది డార్క్‌’ అనే ఇండియా ఫస్ట్‌ వర్చువల్‌ ఆడియో షార్ట్‌ ఫిలిం చేశాం. నాని హీరోగా నటించిన ‘మజ్ను’ మూవీ ట్రైలర్‌కు బీజీఎం ఇచ్చాను. ఆ ట్రైలర్‌కు నేను అందించిన సంగీతం నచ్చి నాని తను నిర్మిస్తున్న ‘అ..!’ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అవకాశం కల్పించారు. ఆ సినిమాకు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించారు. అలా టాలీవుడ్‌లో సంగీత దర్శకుడిగా నా ప్రయాణం మొదలైంది.

ఇప్పటికి 20కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించాను. నాకు కమర్షియల్‌ సినిమాలు చేయడం ఇష్టం. స్టార్‌ హీరోలకు ఎలాంటి బీజీఎం ఇవ్వాలి అనేది పూర్తిగా అవగాహన ఉంది. ప్రభాస్‌ కోసం కొన్ని బీజీఎంలు చేసి పెట్టాను. చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాకు మ్యూజిక్‌ చేయాలనేది నా డ్రీమ్‌. ఇటీవల గద్దర్‌ అవార్డ్స్‌లో ఆయనను కలిసి దగ్గరగా చూశాను. షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాను. ఆ సందర్భం ఒక స్వీట్‌ మెమొరీగా గుర్తుండిపోతుంది. ప్రస్తుతం ‘కథాకళి’ సినిమా చేస్తున్నాను. అలాగే ప్రశాంత్‌ వర్మతో రెండు మూవీస్‌ చేస్తున్నాను. ఒక స్టార్‌ హీరో సినిమాకు చర్చలు జరుగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -