Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పశువులను గాలికుంటు వ్యాధి నుంచి రక్షించడం అవసరం

పశువులను గాలికుంటు వ్యాధి నుంచి రక్షించడం అవసరం

- Advertisement -

జిల్లా పశు సమర్ధక శాఖ అధికారి రోహిత్  రెడ్డి 
నవతెలంగాణ – ఆర్మూర్

పశువులను గాలికుంటు వ్యాధి నుంచి రక్షించటం అవసరమనీ జిల్లా పశువైద్యా, పశుసంవర్ధక శాఖ అధికారి రోహిత్ రెడ్డి అన్నారు. ఆలూర్ మండలం మచర్ల గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గురువారం  గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 65 గేద జాతి , 31 గో జాతి పశువులకు టీకాలు వేశారు.

ఈ కార్యక్రమంనికి విచ్చేసి   మాట్లాడుతూ, పశువులను గాలికుంటు వ్యాధి నుండి రక్షించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గాలికుంటు వ్యాధి సాధారణంగా దోమల ద్వారా వ్యాపిస్తుందని, ఈ వ్యాధి సోకిన పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు తీవ్రమైన సందర్భాల్లో ప్రాణనష్టం కూడా సంభవించే అవకాశం ఉందన్నారు. పశువుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రతి పశువుకీ తప్పనిసరిగా టీకా వేయించాలని రైతులను ఆయన సూచించారు. టీకా వేయించడం ద్వారానే గాలికుంటు వ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చని  అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సందీప్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -