– బిల్డర్స్ మేలు కోసం హైడ్రా : ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎక్కువస్థాయిలో యూరియా ఉపయోగించి వరిని పండించడం మంచిది కాదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఏటా 45 లక్షల టన్నుల వరి తింటున్నారనీ, 2 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుందని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం యూరియాకు సబ్సిడీ ఇస్తోందన్నారు. ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చి కేంద్రం కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. యూరియా కోటాను ఇంకా పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి అడగటం సరిగాదన్నారు. వరి సాగును తగ్గించి తృణధాన్యాల సాగును పెంచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగంలో లేకుండా ఈ ఏడాది వరి దిగుబడి బాగానే వచ్చిందని తెలిపారు. దేశంలోని నాలుగు కోట్ల మంది బంగ్లాదేశీయులు అక్రమంగా చొరబడ్డారనీ, తెలంగాణలోనే 20 లక్షల మంది ఉన్నారని ఆరోపించారు. గతంలో తాను హైడ్రాను మెచ్చుకున్నానన్నారు. అయితే, బిల్డర్స్ కోసమే దాన్ని తెచ్చినట్టుందని ఇప్పుడు అర్థమవుతున్నదని విమర్శించారు. ఓవైసీ ఫాతిమా కళాశాలను కూల్చే దమ్ము హైడ్రాకు ఎందుకు లేదని ప్రశ్నించారు. ఎంఐఎం నేతలకు కాంగ్రెస్ లొంగిపోయిందని ఆరోపించారు. పార్టీలో ఉంటూ వ్యతిరేకంగా మాట్లాడేవారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. కొంత మంది మంచి తనంతో పార్టీకి నష్టం జరుగుతున్నదన్నారు. క్షేత్రస్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేయాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు.
యూరియాతో వరి పండించడం మంచిది కాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES