Monday, February 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభ్యర్థులను ఇబ్బందులు పెట్టడం సరికాదు   

అభ్యర్థులను ఇబ్బందులు పెట్టడం సరికాదు   

- Advertisement -

నవతెలంగాణ- ఆర్మూర్   
పాలక పక్షానికి చెందిన కొందరు నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి వారిపై ఒత్తిడి తేవడం సరికాదని హమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ సయ్యద్ అవేజ్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 అందరికీ సమాన హక్కులను కల్పిస్తుంది. అన్ని విషయాలలో సమానత్వం ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 14లో పేర్కొన్నారని అన్నారు. కొందరు నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను మరోసారి మోసం చేయాలనే ఉద్దేశ్యంతో సామాన్య పౌరులపై ఒత్తిడి తెస్తున్నారు.

బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఒక్క ఆర్టికల్ కూడా తెలియని వారు ఇతరులను బెదిరించడానికి సాహసిస్తారా? రాజ్యాంగం తెలియని వారికే ఇంత అహంకారం ఉంటే, రాజ్యాంగం తెలిసిన ఆ యువతీ యువకులకు, సామాన్య ప్రజలకు ఇంకెంత అహంకారం ఉండాలి? జాగ్రత్త! అని అన్నారు.ఈ సమాజంలోని ప్రజలపై మీరు ఒత్తిడి తెస్తే, ఈ ఎన్నికల్లో మీ డిపాజిట్లు కోల్పోతారు. మీకు రాజ్యాంగం గురించి ఏం తెలుసు? రోడ్డుపై చెత్త ఏరుకునే వ్యక్తికి కూడా కౌన్సిలర్‌గా, ఎమ్మెల్యేగా , ఎంపీగా పోటీ చేసే హక్కు ఉంది, ఈ హక్కును మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినారని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -