Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కులాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదు..

కులాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదు..

- Advertisement -

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
లంబాడి జాతి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆల్ ఇండియా బంజారా సంఘం మండల అధ్యక్షులు రాథోడ్ విజయ్ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని పాత్రికేయులతో సమావేశమై అనంతరంఆయన మాట్లాడుతూ .. లేని అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి కులాల మధ్య, జాతుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ సోయం బాపూరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తమ పనికిమాలిన ప్రయత్నాలను మానుకోవాలని అన్నారు. లంబాడి జాతి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆల్ ఇండియా బంజారా సంఘం మండల అధ్యక్షుడు రాథోడ్ విజయ్ డిమాండ్‌ చేశారు. నిజంగా బంజారా, లంబాడ, సుగాలి జాతుల ప్రజలపై జాతీయ పార్టీ నాయకులకు ప్రేమ ఉంటే, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న సోయం బాబూరావు, తెల్లం వెంకట్రావులను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని రాంబల్ నాయక్ డిమాండ్ చేశారు. ఇలాంటి కుట్రపూరితమైన చర్యలను వీరు మానుకోకుంటే రాష్ట్ర ఉన్న 40 లక్షల మంది లంబాడి జాతి వారందరం ఒక్కటై వీరికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సవైసింగ్, యూత్ అధ్యక్షులు పవన్, కార్యదర్శి నితిన్, ఉపాధ్యక్షులు చరణ్, దుర్గా దాస్ నాందేవ్, గణేష్,సంతోష్,సంగ్రామ్ అరవింద్.. సంఘ సభ్యులు పాల్గొన్నారు..

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad