నవతెలంగాణ – రాయపర్తి
బిఆర్ఎస్ పార్టీ చోట లీడర్లు స్థాయిని మించి విమర్శించడం సరికాదని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు చిర్ర మల్లయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… బిఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు గల్లి లీడర్లతో కాంగ్రెస్ పార్టీ నాయకులపై దుర్భాషలాడించడం నీచ సంస్కృతికి నిదర్శనమని దుయ్యబట్టారు. చిన్నపాటి పైరవీలు చేసుకొని పైసలు వసూలు చేసే వారు కూడా లీడర్లమంటూ పొంగిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తగిన గుణపాఠం చెప్పక తప్పదు అని హెచ్చరించారు.
రైతుల కోసం ధర్నా చేస్తున్నామని మొసలి కన్నీరు కార్చే వారి గురించి ప్రజలకు స్పష్టంగా తెలుసు అని తెలిపారు. ప్రతి ఒక కుటుంబానికి అండగా నిలబడే బిల్లా సుధీర్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు బిఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్కరికి లేదు అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కమిషన్ ల రూపంలో ఎవరు తీసుకున్నారో అందరికీ తెలుసు అన్నారు. గతంలో బిల్లా సుధీర్ రెడ్డి దగ్గరికి వెళ్లి కాలవేలపడి పనులు చేసుకున్న వారు ఇప్పుడు మేమే లీడర్లు అంటూ గ్రామ సింహంల గర్జించడం సిగ్గుచేటు అన్నారు. ఇదే దాంతో మరొకసారి పునరావృతం అయితే సహించేదే లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గారె భిక్షపతి, బద్దం రంగారెడ్డి, గుగులోతు యాకూబ్, కిషన్ నాయక్, రామా నాయక్, వీరు నాయక్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
స్థాయిని మించి విమర్శించడం సరికాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES