ఈ తీర్పుపై హైకోర్టు ఆలోచించాలి
బకాయిల విడుదలపై రాష్ట్ర సర్కారుకు డెడ్‌లైన్ పెట్టాలి : ఏఐఎస్‌ఎఫ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకపోతే ఆ ఫీజులను విద్యార్థులు చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు పేద, మధ్య తరగతి వర్గాల వారికి వ్యతిరేకంగా ఉందనీ, ఆ తీర్పును పున:సమీక్షించాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్టలక్ష్మణ్ కోరారు. శుక్రవారం ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. నాలుగేండ్ల నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకుండా గత బీఆర్‌ఎస్, నేటి కాంగ్రెస్ పాలకులు ఉన్నత విద్యనభ్యసిస్తున్న లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడాయని విమర్శించారు.
ఆ పథకం ద్వారా చదువుకున్న పేద విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం వెళ్తే ఫీజులు కడితేనే ఇస్తామని యాజమాన్యాలు వేధించడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై రాష్ట్ర సర్కారుకు ఒక డెడ్‌లైన్‌ను విధించాలని కోరారు. పేద విద్యార్థుల ఆసరా కోసం తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రకు రేవంత్‌రెడ్డి సర్కారు పూనుకున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులు ఫీజులు చెల్లించాలనటం సరిగాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



