- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
ఉద్యోగులు నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత మన అందరిపై ఉందని హుస్నాబాద్ ఆర్డిఓ రాంమూర్తి అన్నారు. మంగళవారం హుస్నాబాద్ ఐ ఓ సి కార్యాలయం ఎదుట రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనాటి మొక్కలే రేపటి భావితరాలకు సంపద అన్నారు. మొక్కల పెంపకంతో ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన వాతావరణం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ లక్ష్మారెడ్డి, డిప్యూటీ తహసిల్దార్, ఆర్ ఐ రాజు నాయక్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -