నాటి, నేటి రాజకీయాలకు అర్థాలు మారాయి
విలువలతో కూడిన రాజకీయమే సమాజానికి మేలు
రేమద్దులకు ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తా
మా మద్దతుతో సీపీఐ(ఎం) సర్పంచ్ అభ్యర్థి భారీ మెజార్టీ సాధిస్తాడు
రేమద్దుల సీపీఐ(ఎం) సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
నవతెలంగాణ – వనపర్తి
కామ్రేడ్ లను కలుపుకోవడం మా బాధ్యత అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వనపర్తి జిల్లా పానగల్ మండలం రేమద్దుల గ్రామంలో కాంగ్రెస్, సీపీఐ(ఎం) ఉమ్మడి అభ్యర్థి రేగి చెట్టు నిరంజన్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ శనివారం రేమద్దుల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్, సీపీఐ(ఎం) నిర్వహించిన ఈ ప్రచారంలో ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని మాట్లాడారు. సమాజంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజా విజయాల కోసం పనిచేసే కామ్రేడ్ లను ఎన్నికల సందర్భంగా కలుపుకుపోవడం తమ బాధ్యత అని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు.
తాను రాజకీయాల్లోకి వచ్చిన సందర్భంగా ఇంట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని రాజకీయంగా ఎదిగానని అన్నారు. పలు సందర్భాల్లో సీపీఐ(ఎం) జిల్లా నాయకత్వం తనకు మద్దతు ప్రకటించి అండగా నిలిచారని తెలిపారు. అలాంటిది ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో రేమద్దుల గ్రామపంచాయతీకి ఉమ్మడి అభ్యర్థిగా రేగి చెట్టు నిరంజన్ నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ సపోర్టుతో భారీ మెజార్టీని అందించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. స్థానిక నాయకుల్లో కొంత వ్యతిరేకత అసహనం ఉన్నప్పటికీ, రాజకీయంగా తీసుకున్న పార్టీ నిర్ణయాలను, ఇతర సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొని సీపీఐ(ఎం) అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించే బాధ్యత తాను తీసుకుంటున్నానని తెలిపారు.
స్థానికంగా సీపీఐ(ఎం)కు ఉన్న బలాబలాలను పరిశీలించినప్పుడు సీపీఐ(ఎం) అభ్యర్థి నిరంజన్ ఇప్పటికే గెలిచారని భావిస్తున్నానని చెప్పారు. నాటి రాజకీయాలకు నేటి రాజకీయాలకు అర్థాలు మారాయని అభిప్రాయపడ్డారు. అప్పట్లో వ్యక్తులు సామాజిక అంశాలు కోనంగా ఎంతో ప్రాధాన్యత్వం ఉన్న రాజకీయ అంశాలు నేడు డబ్బు వ్యక్తుల పరంగా మారిపోయాయని తెలిపారు. 1990లో తాను రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు సెంటు గుంట కృష్ణ జలాలతో పంట అనే నినాదంతో ముందుకు వచ్చానని తెలిపారు. ఇదే రేమద్దులలో స్థానిక సమస్యలపై ఎన్నో రోజులు ఉద్యమాలు నిర్మించి, చివరికి రైతుల సమస్యలపై జైలుకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడినా.. వెనకడుగు వేయలేదని మంత్రి చెప్పారు. కాబట్టి రాజకీయాలకతీతంగా సీపీఐ(ఎం) అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ బలపరిచిన నాయకుడిని సర్పంచి స్థానానికి భారీ మెజారిటీని ఇచ్చి ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తాను రాజకీయాలకు వచ్చిన నాటి నుంచి ఎన్టీ రామారావు, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల హయాంలోనూ తాను ప్రజా సమస్యలపై ఎన్నడూ రాజీ పడలేదని చెప్పారు. కృష్ణా జలాల తరలింపుతో పాటు ఆంధ్ర ప్రజలకు ఇంటి వ్యవసాయ మోటార్లకు కరెంటు బిల్లుల్లో రాయితీ ఇచ్చిన అప్పటి ప్రభుత్వం కేవలం తెలంగాణ రైతులనే ఎందుకు ఇబ్బంది పెడుతుందని ప్రశ్నించానని గుర్తు చేశారు. దానివల్లే జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అంతటితో ఆగక ఆనాడు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రతి ఉద్యమానికి తన సపోర్టు అందించానని తెలిపారు. ప్రస్తుతం కూడా అదే స్థాయిలో తమ క్యాడర్ సీపీఐ(ఎం)కు మద్దతుగా నిలుస్తూ.. అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని హామీని ఇచ్చారు. తాను విలువలతో కూడిన రాజకీయాలే ఎప్పుడూ చేస్తుంటానని అన్నారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు లకే తాను బెదరలేదని, ప్రస్తుతం అక్కడక్కడ తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమైన ముఖ్యుల్లో ఒకరినైన తనను కించపరుస్తూ అవమాన పరుస్తూ చేసే ఆరోపణలు తాను ఎన్నటికీ లెక్కచేయనని ఘాటుగా సమాధానం ఇచ్చారు.
రేమద్దులకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గతంలో చేసిన అభివృద్ధితోపాటు ప్రస్తుతం పెండింగ్లో ఉన్న తాగునీరు రోడ్ల సమస్యలు సిసి రోడ్ల ఏర్పాటు డ్రైనేజీలు ఇతర అంశాలన్నింటినీ తాను ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్నింటినీ పరిష్కరిస్తానని గ్రామస్తులకు హామీని ఇచ్చారు. నిరంజన్ ను భారీ మెజార్టీతో గెలిపించడమే తనకు మీరిచ్చే కానుక అని చెప్పారు. అంతకుముందు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బార్, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కిల్లే గోపాల్, సీపీఐ(ఎం) సర్పంచ్ అభ్యర్థి ఎర్రగు చెట్టు నిరంజన్ మాట్లాడుతూ.. గతంలో సాధించిన విజయాల కన్నా నేడు గ్రామానికి చాలా సమస్యలు ఉన్నాయని అన్నారు.
వాటి పరిష్కారం కోసం మంత్రి సహకారంతో కృషి చేస్తూ అన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా గత పోరాటాల స్ఫూర్తిని అందిపుచ్చుకొని నేడున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, గ్రామాల్లో రైతులకు అవసరమైన సాగునీటి కాలువల ఆవశ్యకత అన్నింటి పైన దృష్టి సారించి మంత్రి పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ బహిరంగ సభకు సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జి వెంకటయ్య అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం), కాంగ్రెస్ మండల నాయకులు పాల్గొన్నారు.

shaking: 0.031324074; algolist: 0;
multi-frame: 0;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 7864320;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 47;



