నవతెలంగాణ – మిర్యాలగూడ
ఆపదలో వుండి వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వస్తె కనీస సౌకర్యాలు లేకపోవడం, తాగడానికి నీళ్ళు లేకపోవడం బాధాకరమని బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్ అన్నారు. ఆదివారం విలేఖర్లతో మాట్లాడుతూ ప్రాణాలు నిలబెట్టుకునేందుకు ఆసుపత్రులకు వస్తె వున్న ప్రాణాలు పోవడం రోగులను ఆందోళనకు గురి చేస్తోందని చెప్పారు.మిర్యాలగూడలో జ్వరంతో ఆసుపత్రికి వచ్చిన యువకుడు నీటి కోసం ల్యాబ్ లోని రసాయనం తాగడం సహించారని ఘటన అని చెప్పారు.కనీస సౌకర్యాలు కల్పించని ఆసుపత్రిని రద్దు చేయడంతో పాటు,నిర్వాహకులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అన్ని ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు విషయమై విచారణ జరిపి మౌలిక వసతులు వుండేలా చర్యలూ తీసుకోలనీ కోరారు.సమావేశంలో బంజారా ఉద్యోగుల సంఘం నాయకులు గోపి నాయక్, సైద నాయక్,మక్లానాయక్,శ్రీను నాయక్, జమ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రయివేటు ఆస్పత్రిల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం బాధాకరం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



