Thursday, July 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాయపోల్ ఎస్సై రఘుపతి బదిలీ కావడం బాధాకరం

రాయపోల్ ఎస్సై రఘుపతి బదిలీ కావడం బాధాకరం

- Advertisement -

బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం నాయకులు రాజిరెడ్డి..
నవతెలంగాణ – రాయపోల్ 
: రాయపోల్ ఎస్సైగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందిన విక్కుర్తి రఘుపతి బదిలీ కావడం బాధాకరమని బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం నాయకులు రాజిరెడ్డి అన్నారు. బుధవారం
రాయపోల్ మండల ఎస్సైగా గత రెండు సంవత్సరాలుగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న విక్కుర్తి రఘుపతికి వీడ్కోలు పలుకుతూ ఘన సన్మానం చేశారు. అలాగే నూతనంగా వచ్చిన ఎస్సై మానసకు స్వాగతం పలుకుతూ సన్మానం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాయపోల్ ఎస్సైగా విధులు నిర్వహించి ప్రజల ప్రశంసలు పొందిన ఎస్సై రఘుపతి రాయపోల్ నుంచి బదిలీపై వెళ్లడం ఎంతో బాధాకరంగా ఉందన్నారు. అనంతరం బదిలీపై వెళ్తున్న ఎస్సై రఘుపతి మాట్లాడుతూ.. తాను ఎస్ఐగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మండల ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. బదిలీలు సహజమని ఎక్కడికి వెళ్ళినా ప్రజల హృదయాలను గెలుచుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఎస్సైగా విధులు నిర్వహించిన తనకు అధికారులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాల సభ్యులు,మాజీ సర్పంచులు, మాజి ఎంపీటీసీలు, ఆయా గ్రామాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం శిక్షణ పూర్తి చేసుకొని రాయపోల్ నూతన ఎస్సైగా పదవీ బాధ్యతలు చేపట్టిన మానసకు ఘనంగా సన్మానం చేసి స్వాగతం పలుకుతూ అభినందనలు తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామచంద్రం గౌడ్, బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్, భార్గవ్, మురళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -