Sunday, October 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రకృతి విపత్తుపై రాజకీయం చేయడం సిగ్గుచేటు 

ప్రకృతి విపత్తుపై రాజకీయం చేయడం సిగ్గుచేటు 

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
ప్రజలు ప్రకృతి వైపరీత్యంతో కాకావికాలం చెందుతే వారిని పరామర్శించడానికి మీకు నెలరోజుల తర్వాత తీరిందా, లేదా స్థానిక ఎన్నికల లబ్ధి కోసమా ? బిఆర్ఎస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో వర్షాలు వడగళ్ల వాన వల్ల ఎన్నోసార్లు పంట నష్టం జరిగినా ఏ ఒక్కసారి కూడా రైతులను ఆదుకోలేదు. ఇక్కడి ప్రజలపై ప్రేమతో రాలేదు స్థానిక ఎన్నికల్లో పరువు కాపాడుకోవడానికి హరీష్ రావు పర్యటన అని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్  హరీష్ రావు పర్యటన పై అన్నారు.

ఈ సందర్భంగా ఆయన తన నివాసంలో మాట్లాడుతూ.. కుటుంబ సమస్యలు నుండి తేరుకొని బాధితులను పరామర్శించడానికి నెల రోజులు పట్టిందనీ, ప్రజల నివాసాలు నీళ్లతో కొట్టుకు పోయి  హహకారాలు చేస్తుంటే బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎటుపోయారన్నారు. వర్షాల్లో ప్రమాదమని తెలిసి కూడా ముఖ్యమంత్రి  హెలిపాడ్ లో ముంపు ప్రాంతాలు చూడడానికి వచ్చారన్నారు. వాతావరణం అనుకూలించక ప్రజలను పరామర్శించలేకపోయారనీ, తిరిగి రెండు రోజుల్లో వచ్చి నష్టపోయిన రైతులతో మాట్లాడి వారిని పరామర్శించి వారి కుటుంబాలకు తక్షణ సహాయం కింద 11 వేల రూపాయల చొప్పున చనిపోయిన వారి కుటుంబాలకు నాలుగు లక్షలు అందించారన్నారు.  నాలుగు గంటలలో రోడ్లను మరమ్మతు చేసి రాకపోకలను పునరుద్ధరించారు.

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ నిర్వహించి అధికారులను సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగిందన్నారు. వారు ఇచ్చిన నివేదికను కేంద్రానికి పంపించడం జరిగిందని,  రాష్ట్ర ప్రభుత్వం నుండి చేయాల్సిందంతా చేస్తున్నారు. కేంద్రం నుండి ఇప్పటివరకు ఏలాంటి సహాయం అందలేదన్నారు. బిఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోయే రోజులు వచ్చాయి, వారి హయాంలో దోపిడి తప్ప  రైతులకు, ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.

రుణమాఫీ చేయలేదు, రేషన్ కార్డులు ఇవ్వలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వలేదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 65 వేల ఉద్యోగాలు ఇచ్చాం, పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తున్నాం అన్నారు. హౌసింగ్ కార్పొరేషన్ ఎత్తివేసి డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని పదేళ్లలో నియోజకవర్గానికి 100 బెడ్ రూమ్ లు ఇవ్వలేదన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లను అందిస్తుందనీ, తొమ్మిది రోజుల్లో 9000 కోట్ల రైతు  భరోసా అందించాం.

ఇప్పటివరకు 27 వేల కోట్ల రూపాయలు రైతు రుణ మాఫీ చేసాం, పేదలకు సన్న బియ్యం, 200 యూనిట్లు ఉచిత కరెంటు 500 కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించి  ప్రజాపాలన అందిస్తున్నాం అన్నారు. మీ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులు చేయాలని సంకల్పంతో మహిళ సంఘాలను పటిష్టం చేయడం జరుగుతుందన్నారు.

మీది మాటల ప్రభుత్వం, మాది చేతల ప్రభుత్వం 

బయట కేంద్రం పై మాట్లాడతారు .. లోపటి నుండి బిజెపికి సహాయం అందిస్తుంటారు. నిన్నటి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కేంద్రానికి సహాయపడ్డారు, వారి ప్రతి బిల్లుకు పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతు తెలిపారు. ప్రజలందరికీ ఈ విషయం తెలిసే మిమ్మల్ని ఓడించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -