Saturday, October 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయడం యూత్ కాంగ్రెస్ బాధ్యత…

ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయడం యూత్ కాంగ్రెస్ బాధ్యత…

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
మండలం ధన్వాడ గ్రామంలో శుక్రవారం రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు ఆదేశాల మేరకు కాటారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చిటూరి మహేష్ గౌడ్ గారి అధ్యక్షతన యూత్ కాంగ్రెస్ మండల స్థాయి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించడానికి తీసుకోవాల్సిన వ్యూహాలు, పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన చర్యలపై కీలక చర్చలు జరిగాయి.ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు చీటూరి మహేష్ గౌడ్ మాట్లాడుతూ…
గ్రామ స్థాయిలో యూత్ కాంగ్రెస్ కమిటీలను ఎలాంటి సీనియర్ నాయకుల ప్రలోభేదాలు లేకుండా గ్రామ శాఖ అధ్యక్షులను ఎన్నుకోవాలని యూత్ నాయకులు చర్చించారూ. యువతను పార్టీతో కలిపి ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పని చేయాలని సూచించారు.
పార్టీ సిద్ధాంతాలు,నాయకుల త్యాగాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి చేరవేయడం యూత్ కాంగ్రెస్ ముఖ్య బాధ్యతగా నిర్ణయించారు. అదేవిధంగా కాటారం మండలం లో మంత్రి శ్రీధర్ బాబు శ్రీను బాబు అమలు చేస్తున్న ప్రజాహిత పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించి,ఆ పథకాలు అందరికీ చేరేలా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సేవను తమ ధ్యేయంగా చేసుకోవాలని సూచించారు.
వచ్చే స్థానిక ఎన్నికల్లో యువత ముందుండి అధిష్టానం నిర్ణయించిన వారిని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని యువత పక్కదారి పట్టకుండా చూసుకునే లాగా ఉండడానికై గ్రామ శాఖ అధ్యక్షులు ఉప అధ్యక్షులను ఎన్నుకొని పార్టీ కోసం పనిచేయాలని పార్టీలోని ఎలాంటి విషయాలు పక్కదారి పట్టకుండా చూసుకోవాలని ఈరోజు సమావేశంలో గ్రామ శాఖ అధ్యక్షులు సూచించారు.
అదే విధంగా ఈ రోజు వరకు ఉన్న యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీలను రద్దు చేయడం జరిగింది.అలాగే రేపటి నుండి నూతన కమిటీలు వేయడం జరుగుతుందనీ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మంథని నియోజకవర్గ డివిజన్ అధ్యక్షుడు చీమల సందీప్, కాటారం మండలం యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -