Thursday, May 22, 2025
Homeఖమ్మంరేపటి పౌరులను తీర్చిదిద్దేది నేటి ఉపాధ్యాయులే..

రేపటి పౌరులను తీర్చిదిద్దేది నేటి ఉపాధ్యాయులే..

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
నేటి ఉపాధ్యాయులే రేపటి తరం పౌరులను మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దేది అని, విద్యార్ధులతో ఉపాధ్యాయులు మమేకం అయితేనే బోధనలో రాణిస్తారని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. నియోజక వర్గం కేంద్రం అయిన  అశ్వారావుపేట లోని స్థానికి జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో కోర్స్ డైరెక్టర్,ఎంఈఓ పొన్నగంటి ప్రసాదరావు పర్యవేక్షణలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న ప్రాధమిక పాఠశాలల ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణకు బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులను ఉద్దేసించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యా నాణ్యతను పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని విద్యార్థులకు బలమైన పునాది వేస్తేనే వారు భవిష్యత్తు లో ఉన్నత  స్థానాలకు చేరుకుంటారని అన్నారు.ఉపాధ్యాయులకు అవసరమైన వనరులు అందిస్తే బోధనావిధానం మరింత మెరుగై విద్యార్థుల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.

ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు నూతన బోధన మార్పులను ఆకలింపు చేసుకుని వారి నైపుణ్యాన్ని మరింత మెరుగు పరుచు కోవాలి అని సూచించారు. విద్యార్థులలో దాగి ఉన్న అంతర్గత నైపుణ్యాలను వెలికి తీయాలని అన్నారు అశ్వారావుపేట నియోజకవర్గస్థాయిలో విద్యాభివృద్ధికి తన నుంచి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. చివరిగా ఎస్సార్పీ స్వరూప్ కుమార్, డీఆఎర్పీ శంకర్ రిసోర్స్ పర్సన్స్ బి. శ్రీశైలం,సున్నం నాగేశ్వరరావు, పి.రాము, ఎం.పర బ్రహ్మచారి,కొర్రి వెంకటేష్, వీ.సీతారాములు, ఎస్.భాస్కర్, ఏ.శ్రీనివాసరావు లను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీ లు సిద్దాంతపు ప్రభాకరాచార్యులు, మాలోత్ రామారావు, క్లర్క్ ఎస్.కే మహా బూబ్, ఆపీస్ సబార్డినేట్ లు టి.సుజాత, ఎస్.కే ఖాదర్ బీ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -