- Advertisement -
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని గోల్డెన్ యాడ్స్ కాలనీలో పిస్తా హౌస్ ఓనర్ ఇంటిపై మంగళవారం ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. పిస్తా హౌస్ ఓనర్‌తో పాటు డైరెక్టర్ల ఇంట్లో కూడా ఏకకాలంలో 15 బృందాలుగా ఉదయం నాలుగు గంటల నుంచి తనిఖీలు ప్రారంభించారు. కొంత కాలంగా కోట్లలో పిస్తా హౌస్ వ్యాపారం జరుగు తున్నా ఐటీ మాత్రం తక్కువ మొత్తంలో చూపించడంతో ఐటీ అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఓనర్‌తోపాటు డైరెక్టర్ల ఇండ్లలో సోదాలు నిర్వ హించారు. వారి ఇండ్లలో విలువైన డాక్యుమెంట్లను, బ్యాంకు లావాదేవీలను అధికారులు పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



