నిరంజన్, గ్రీష్మ నేత్రికా, ప్రియ జస్పర్, దీప్తి శ్రీరంగం హీరో, హీరోయిన్స్‌గా జీ సినిమా బ్యానర్ పై నేలబల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా గంగాధర రావు నిర్మిస్తున్న సినిమా ‘రుక్మిణి’. నేలబల్లి కుమారి సమర్పకులు. సింహాచలం గుడుపూరి దర్శకుడు. శుక్రవారం హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా ఈ మూవీ టీజర్ విడుదలైంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’టీజర్ అద్భుతంగా ఉంది. హీరోగా పరిచయం అవుతున్న నిరంజన్‌కి ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలి. టీజర్ చూస్తుంటే డైరెక్షన్, డీవోపీ వర్క్, మ్యూజిక్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను’ అనితెలిపారు. ‘ఒక డిఫరెంట్ హర్రర్ కామెడీ మూవీగా ఈ సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని హీరో నిరంజన్ చెప్పారు. ‘మోహన్ బాబు సినిమాలకు అప్రెంటిస్‌గా వర్క్ చేయడంతో నా కెరీర్ మొదలైంది. ఈ మూవీ కథను దర్శకుడు సింహాచలం చాలా బాగా చెప్పారు. అంతే బాగా రూపొందిస్తున్నారు. మా మూవీకి డీవోపీ వర్క్, అలాగే మ్యూజిక్ చాలా బాగుంటాయి. బీజీఎం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది’ అని నిర్మాత కట్టా గంగాధర్ రావు చెప్పారు. డైరెక్టర్ సింహాచలం గుడుపూరి మాట్లాడుతూ,’ఈ సినిమాతో హీరోగా నిరంజన్ కు మంచి పేరొస్తుంది. మా మూవీ ఇంత బాగా వచ్చిందంటే కారణం మా ప్రొడ్యూసర్స్. వారు ఎంతో ప్యాషనేట్‌గా రాజీ పడకుండా నిర్మించారు’ అని తెలిపారు.
నవ్విస్తూనే భయపెడుతుంది
- Advertisement -
- Advertisement -



