Monday, April 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుడిసె లేని తాండగా తీర్చిదిద్దుకోవాలి

గుడిసె లేని తాండగా తీర్చిదిద్దుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి  : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి తలపెట్టిన ఇందిరమ్మ గృహాలకు మంజూరైన వారు త్వరితగతిన గృహాలను నిర్మించుకోని ప్రభుత్వం అందజేస్తున్న డబ్బులను సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, సర్పంచ్ కట్రోత్ బంతిలాల్  పేర్కొన్నారు. సోమవారం ఇందల్ వాయి మండలం లోని మేఘ్య నాయక్ తండా గ్రామంలో అంబర్ సింగ్, నాతి భాయి లకు సంబంధించిన ఇందిరమ్మ లబ్దిదారుల ఇండ్లకు ముగ్గులు వేసి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలప్పుడే రాజకీయాలని, ఎవరికైతే ఇల్లు మంజూరయ్యాయో వారు వెంటనే పనులను ప్రారంభించు కోవలని సూచించారు. తాండలో గుడిసె లేని గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుకోవాలని, గతం లాగా లేదని పనులు జరిగిన వెంటనే డబ్బులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి వస్తున్నాయని  వివరించారు.మండలంలోని అన్ని గ్రామాలకు తాండలకు ఆదర్శంగా నిలిచే విధంగా అందరు కలిసికట్టుగా ఉంటూ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకోవాలని ఎంపీడీవో కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాలోత్ సోమ్లనాయక్, పంచాయతీ కార్యదర్శి షేక్ గౌస్, మాజీ వైస్ ఎంపీపీ పూర్య నాయక్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు సోమ్ల నాయక్ ,గంగరాం నాయక్, కారోబార్ వినోద్ తోపాటు వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, తాండ పెద్దలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -