Saturday, January 10, 2026
E-PAPER
Homeజిల్లాలుఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి : మాజీ ఎమ్మెల్యే జూలకంటి

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి : మాజీ ఎమ్మెల్యే జూలకంటి

- Advertisement -

నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ కు సన్మానం 
నవతెలంగాణ – మిర్యాలగూడ 

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. సోమవారం స్థానిక అమరవీరుల భవనంలో బోట్యా నాయక్ తండలో సీపీఐ(ఎం) మద్దతుతో బిఆర్ఎస్ సర్పంచ్ బానోతు సాగర్ నాయక్, సీపీఐ(ఎం) ఉప సర్పంచ్ శ్రీను నాయక్ తో పాటు వార్డు సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వాటిని గుర్తించి పరిష్కరించాలని కోరారు.

ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని అన్నారు. చెత్తాచెదారం లేకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచి మండలంలోని తండాను ఆదర్శ గ్రామపంచాతీగా తీర్చిదిద్దాలని సూచించారు. నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని ప్రజల మన్ననలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు నూకల జగదీష్ చంద్ర, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పిలుట్ల సైదులు, బాలాజీ నాయక్, వాడు సభ్యులు బనావత శ్యామ్ బనావతు చీలికి ధరావతు రాంజీ, ధరావత్ సంతోష్ నాయక్ టీజీఎస్ అధ్యక్షులు ధరావత్ రవీందర్, నాయకులు గోమేటి సత్యనారాయణ బానోతు హుస్సేన్, సైదిరెడ్డి రాముడు నవీన్ రాజేందర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -