Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeసినిమాసామరస్యంగా పరిష్కరించుకోవాలి

సామరస్యంగా పరిష్కరించుకోవాలి

- Advertisement -

– ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌
టాలీవుడ్‌లో నెలకొన్న సమస్యలపై పలువురు అగ్ర నిర్మాతలు సోమవారం ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం మంత్రి దుర్గేశ్‌ మాట్లాడుతూ, ‘ఆందోళన నేపథ్యంలో సినీ కార్మికులు, నిర్మాతలు ఇరువురూ చెప్పే విషయాలను వింటాం. ఈ అంశంపై ఫెడరేషన్‌, ఫిల్మ్‌ ఛాంబర్‌ సామరస్యంగా మాట్లాడుకోవాలి. అవసరమైతే సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి సంబంధిత అంశాన్ని తీసుకెళ్ళి చర్చిస్తాం. ప్రభుత్వ జోక్యం అవసరమైతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. ఏపీలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు కృషి చేస్తాం. ఏపీలో ఎవరైనా స్టూడియోలు, రీ-రికార్డింగ్‌, డబ్బింగ్‌ థియేటర్లు నిర్మించాలని ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తాం’ అని తెలిపారు.
మంత్రి దుర్గేశ్‌తో సమావేశం అనంతరం నిర్మాతలు మీడియాతో మాట్లాడారు. ‘ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సూచనలు ఇచ్చాం. సినీ రంగానికి సంబంధించి ఏపీలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరాం. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను ఆదుకునేలా ప్రోత్సాహకాలు ఇవ్వాలని, అలాగే సినీ రంగాన్ని ప్రత్యేక పరిశ్రమగా గుర్తించాలని కోరాం. థియేటర్ల యజమానులు నష్టపోతున్న దృష్ట్యా ఆదుకోవాలని విన్నవించాం. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక పాలసీ రూపొందించాలని, సమస్యల పరిష్కారానికి సీఎం, డిప్యూటీ సీఎంల అపాయింట్‌మెంట్‌ కోరాం’ అని నిర్మాతలు తెలిపారు. మంత్రి దుర్గేశ్‌తో భేటీ అయిన వారిలో నిర్మాతలు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, డీవీవీ దానయ్య, కె.ఎల్‌.నారాయణ, భరత్‌, నాగవంశీ, యెర్నేని రవిశంకర్‌, విశ్వప్రసాద్‌, బన్నీవాసు తదితరలు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img