Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్పరీక్షలు జరపకుండానే జరిపినట్టు.!

పరీక్షలు జరపకుండానే జరిపినట్టు.!

- Advertisement -

పలువురి పోలీస్ సిబ్బంది హెల్త్ కండిషన్ బుక్ లో సంతకాలు చేసిన వైద్యాధికారి
ఆలస్యంగా వెలుగులోకి
నవతెలంగాణ – చందుర్తి
ఆరోగ్య పరీక్షలు జరుపాలంటే పలు పరీక్షలు జరిపి హెల్త్ కండిషన్ సర్టిఫికెట్ ఇవ్వాలి కానీ ఇక్కడ ఓ విద్యాధికారి అలాంటి పరీక్షలు చేయకుండానే పోలీస్ కనిస్టేబుళ్లకు హెల్త్ కండిషన్ బుక్ పై ప్రభుత్వ వైద్యాధికారి సంతకాలు చేయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న కానిస్టేబుల్ హెల్త్ కండిషన్ ఉన్నట్లుగా ప్రతి సంవత్సరం జిల్లా పోలీస్ అధికారికి వారి ఆరోగ్య పరిస్థితిపై కండిషన్ బుక్ సమర్పించాల్సి ఉంటుంది.

దీంతో గత నెల కిందట స్థానిక పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీల్లో భాగంగా ముందస్తుగా ఓ కానిస్టేబుల్ అప్పటికప్పుడు స్టేషన్లలో ఉన్న సిబ్బంది మొత్తం కండిషన్ బుక్ పై స్థానిక ఆస్పత్రి వైద్యాధికారి పరీక్షలు జరుపకుండానే హెల్త్ కండిషన్ బుక్ పై సంతకాలు చేసినట్లుగా ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. దీంతో చిన్న తప్పు చేస్తేనే చట్ట పరమైన కేసులు పెట్టె పోలీసులే ఇలా తప్పు దోవ పట్టించడంతో పలు విమర్శలు వస్తున్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img