Monday, July 7, 2025
E-PAPER
Homeఖమ్మంనాలో ఉన్న సేవా దృక్పధం మే నన్ను రాజకీయాలకు పురికొల్పింది…

నాలో ఉన్న సేవా దృక్పధం మే నన్ను రాజకీయాలకు పురికొల్పింది…

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఉపాధ్యాయుడు గా విధులు నిర్వహిస్తున్న అప్పటి నుండి నాలో ఉన్న సామాజిక సేవా దృక్పధం మే నన్ను రాజకీయాలకు వైపు వచ్చేలా పురికొల్పింది అని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. లైన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 – ఇ,రీజియన్ 8,జోన్ 2 పరిధిలోని లైన్స్ క్లబ్ ఆఫ్ అశ్వారావుపేట 40 వ, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం పూర్వ అద్యక్షులు దూబగుంట్ల దుర్గారావు అద్యక్షతన ఆదివారం స్థానిక కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వ్యక్తిగతంగా కంటే ఏదో ఒక సంస్థ,వ్యవస్థ ద్వారా చేసే సామాజిక సేవలో విస్త్రుత పరిధి ఉంటుందని ఈ ఆలోచన తోనే నేను రాజకీయాలు ద్వారా ఎక్కువ మందికి సేవ చేయొచ్చు అనే ఆలోచనతో రాజకీయాల్లో ప్రవేశించాలని ఆలోచన వచ్చిందని అన్నారు.

అనంతరం లైన్స్ క్లబ్ నూతన కార్యవర్గం అధ్యక్షులుగా ప్రముఖ న్యాయవాది లక్కినేని నరేంద్ర బాబు,కార్యదర్శిగా ద్విచక్ర వాహన వ్యాపారి బలుమూరి సూర్యారావు,కోశాధికారిగా పట్టణ ప్రముఖులు జూపల్లి బ్రహ్మా రావు లు చేత పీడీ జీ లైన్ కాపా మురళీ క్రిష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు.కార్యవర్గం సభ్యులు కు విధులు,క్లబ్ విధానాలను పీడీ జీ లైన్ దారా కాంతారావు వివరించారు. ఈ కార్యక్రమంలో యు.ఎస్ ప్రకాశరావు, కొఠారి చలపతి రావు, కే.మోహన్ రావు, ఇనుగంటి ప్రవీణ్ కుమార్, కంచర్ల రమేష్ గుప్త, జేకేవీ రమణారావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -