Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలువచ్చే మూడ్రోజులూ వానలే

వచ్చే మూడ్రోజులూ వానలే

- Advertisement -

– ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన
– 500కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదు
– కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో పలుచోట్ల కుండపోత వర్షం
– కామారెడ్డిలో అత్యధికంగా 17 సెంటీమీటర్ల వాన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు ఎక్కువ ప్రాంతాల్లో, భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో పడే సూచనలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్‌ కె.నాగరత్న ప్రకటించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో వర్షం పడే అవకాశముంది. శుక్ర, శనివారాల్లో ఆదిలాబాద్‌, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, హైదరాబాద్‌, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో విస్తారంగా వర్షం పడే సూచనలున్నాయి. అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశముంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో కూడిన వర్షం పడొచ్చు. రాబోయే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే సూచనలున్నాయి. గురువారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రాష్ట్రంలో 500కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో పలుచోట్ల కుండపోత వర్షం పడింది. నిర్మల్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, మెదక్‌ జిల్లాల్లో 60కి పైగా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు
రామారెడ్డి (కామారెడ్డి) 17.13 సెంటీమీటర్లు
కల్‌దుర్కి(నిజామాబాద్‌) 16.38 సెంటీమీటర్లు
తూంపల్లి(నిజామాబాద్‌) 16.33 సెంటీమీటర్లు
సిరికొండ(నిజామాబాద్‌) 13.45 సెంటీమీటర్లు
దర్పల్లి(నిజామాబాద్‌) 12.50 సెంటీమీటర్లు
మదాన్‌పల్లి(నిజామాబాద్‌) 12.45 సెంటీమీటర్లు
భీంగల్‌(నిజామాబాద్‌) 11.80 సెంటీమీటర్లు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad