- Advertisement -
హైదరాబాద్ : ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థ ఐటిసి మాస్టర్ చెఫ్, సీఫుడ్ ప్రియుల కోసం తాజాగా ‘పిరి పిరీ ప్రాన్స్’ పేరుతో సరికొత్త ఫ్రోజెన్ రొయ్యలను మార్కెట్లోకి విడుదల చేసింది. రొయ్యలను వండటం కష్టమైన పనిగా భావించే వినియోగదారుల కోసం, సులభంగా, నిమిషాల్లో రెస్టారెంట్ తరహా రుచిని అందించేలా దీనిని రూపొందించినట్లు ఆ కంపెనీ ప్రతినిధి ఆషు ఫేకీ పేర్కొన్నారు. నాణ్యతకు పెద్దపీట వేస్తూ రొయ్యలు పట్టిన 15 గంట్లోనే ఈ ఉత్పత్తులను తయారు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 212 గ్రాముల ప్యాక్ రూ.275గా నిర్ణయించామన్నారు.
- Advertisement -



