Sunday, August 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంద.మ.రైల్వే పీసీసీఎమ్‌గా ఇతిపాండే బాధ్యతలు స్వీకరణ

ద.మ.రైల్వే పీసీసీఎమ్‌గా ఇతిపాండే బాధ్యతలు స్వీకరణ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దక్షిణమధ్య రైల్వే ప్రిన్సిపాల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ (పీసీసీఎమ్‌)గా శ్రీమతి ఇతిపాండే భూసావల్‌ బాధ్యతలు స్వీకరించారు. భారత రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌ (ఐఆర్టీఎస్‌)-1995 బ్యాచ్‌కు చెందిన ఆమె శనివారం నాడిక్కడి రైల్‌ నిలయంలోని తన కార్యాలయంలో విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆ విభాగం అధికారులు, సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు. అలహాబాద్‌ విశ్వవిద్యా లయం నుండి మనస్తత్వశాస్త్రంలో బంగారు పతక విజేత అయిన ఆమె డివిజనల్‌ రైల్వే మేనేజర్‌గా, సెంట్రల్‌ రైల్వే ప్రధాన కార్యాలయంలో చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ (ప్యాసింజర్‌ సర్వీసెస్‌)గా పనిచేశారు. వెస్ట్రన్‌ రైల్వేలోనూ వివిధ హోదాల్లో పనిచేశారు. వాణిజ్యం, నైపుణ్యం, భద్రత, విజిలెన్స్‌ విభాగాల్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఉత్తమ సేవలకు గానూ ఆమె పలు అవార్డులు కూడా అందుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -