Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐటిఐలు నైపుణ్యం ఆధారిత విద్యకు పునాది

ఐటిఐలు నైపుణ్యం ఆధారిత విద్యకు పునాది

- Advertisement -

– కమ్మర్ పల్లి ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్ కోటిరెడ్డి 
– ఏటీసీ కేంద్రాలతో ఉద్యోగ సృష్టికర్తలుగా యువత
– ఏటిసి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎల్లప్పుడూ నైపుణ్యం ఆధారిత విద్యకు పునాదిగా ఉంటాయని కమ్మర్ పల్లి(బషీరాబాద్) ఐటిఐ ప్రిన్సిపాల్ కోటిరెడ్డి అన్నారు. ఐటిఐ లో ఏటిసి కేంద్రం ప్రారంభించిన నేపథ్యంలో ఆదివారం ఆయన నవతెలంగాణతో ముచ్చటించారు. బషీరాబాద్ లోని ప్రభుత్వ ఐటిఐ వద్ద అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మారుమూల ప్రాంతంలో అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు నైపుణ్య అభివృద్ధి, సాంకేతిక సాధికారత వైపు యువతను తీసుకెళ్లడంలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు.  ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎల్లప్పుడూ నైపుణ్యంఆధారిత విద్యకు పునాదిగా ఉంటాయని తెలిపారు.

ఈ అధునాతన శిక్షణా కేంద్రం స్థాపనతో ఆధునిక పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. బషీరాబాద్ ప్రభుత్వ ఐటిఐలో ఏటీసీ ఏర్పాటు వల్ల ఇప్పుడు సాంకేతిక, అధునాతన శిక్షణ ఇవ్వడమే కాకుండా యువతకు యాంత్రిక, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలలో తాజా జ్ఞానాన్ని సమకూర్చుకోవడానికి ఎంతో దోహద పడుతుందన్నారు. ఏటీసీల ఏర్పాటులో ప్రభుత్వ ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయన్నారు. ప్రపంచంతో పోటీపడే విధంగా విద్యార్థులను తయారు చేయడంలో ఏటీసీ కేంద్రాలు కీలకంగా మారుతాయి అన్నారు. నైపుణ్యం కలిగిన యువతను కేవలం ఉద్యోగార్ధులు కాకుండా ఉద్యోగ సృష్టికర్తలు, ఆవిష్కర్తలుగా మార్చడం ఏటీసీ కేంద్రాల వల్ల వీలు కలుగుతుందన్నారు.

తెలంగాణ అంతటా ఇటువంటి కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా అవకాశాలు గ్రామీణ ప్రాంతాలకు దగ్గరవుతున్నాయన్నారు. గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన విద్యార్థులు తమ స్వగ్రామాన్ని విడిచిపెట్టకుండా అధునాతన సాంకేతిక ప్రయోజనం పొందుతారని తెలిపారు ఏటీసీ కేంద్రాలు కేవలం అధునాతన యంత్రాలు, కొత్త తరగతి గదుల గురించి కాదన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు, నైపుణ్యాలను పదును పెట్టడానికి, ఆశయాలను పెంపొందించడానికి, ఎప్పటికప్పుడు మారుతున్న పరిశ్రమ ప్రపంచంలోకి దూసుకెల్లడానికి దోహదపడతాయన్నారు. ప్రస్తుత ప్రపంచంలో పరిశ్రమకు కొత్త నైపుణ్యాలు అవసరమని తెలిపారు. యువతకు అధునాతన సాంకేతికతతో కూడిన నైపుణ్యాలు ఏటీసీ కేంద్రాల ద్వారా అందుతాయి అన్నారు.

ఏటీసీ కేంద్రాల్లో శిక్షణ పొందిన యువత  సద్వినియోగం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉద్యోగార్ధుల కంటే ఉద్యోగ సృష్టికర్తలుగా మారుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. బషీరాబాద్  ఏటీసీ కేంద్రంలో అధునాతన కోర్స్ లు మానుఫక్టురింగ్ ప్రాసెస్ కంట్రోల్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మానుఫక్టురింగ్, ఆర్తిసన్  యూజింగ్ అడ్వాన్స్ టూల్స్, అడ్వాన్స్డ్ సిఎన్ సి మిసినింగ్ టెక్నీషియన్స్, మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్స్, తదితర ట్రేడ్స్ లలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.బషీరాబాద్ ఐటిఐలో ఏటీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -