Tuesday, October 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మానవతా దృక్పథం మరచి ఫోటోలు తీయడం సిగ్గుచేటు

మానవతా దృక్పథం మరచి ఫోటోలు తీయడం సిగ్గుచేటు

- Advertisement -

ఎంఆర్పిఎస్ నాయకులు మైలారం బాలు
నవతెలంగాణ – ఆర్మూర్

పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను  హత్య జరిగిన సంఘటనలో అక్కడ ఉన్నవారు మానవత దృక్పథం మరిచి ఫోటోలు తీయడం సిగ్గుచేటని ఎమ్మార్పీఎస్ నాయకులు మైలారం బాలు తెలిపారు. పారిపోయిన రియాజ్ ను పోలీస్ లు అహర్నిశలు కష్టపడి పట్టుకోవడం జరిగింది. మళ్లీ గన్ను లాక్కోవడం మళ్లీ తప్పించుకునే ప్రయత్నం చేసిండు. మళ్లీ ప్రాణ నష్టం జరగకుండా ఆత్మ రక్షణలో భాగంగా పోలీస్ లు ఎన్ కౌంటర్ చేయడం జరిగిందని అన్నారు. ఇందులో పోలీస్ లను మెచ్చుకోవడం,  సోషల్ మీడియాలో పోలీస్ ల మీద యువత, ప్రజలు రియల్ హీరో అంటూ ఇన్స్ట్రాగ్రాం ,ఫేసుబుక్, వాట్సప్ స్టేటస్ లలో మీరంతా పోస్ట్ లు పెడుతేనే వాళ్ళు హీరో లు కాదు వాళ్ళు నిజంగానే కనిపించే దేవుళ్ళు.

మీరు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టిన పెట్టకున్నా పోలీస్ లు మన దేవుల్లే అని అన్నారు. ఈ రోజుల్లో పోలీస్ లకు కావాల్సింది సోషల్ మీడియా కాదు సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అన్నారు. ఈ రోజు అది జిల్లాలో లేదు అని తేలిపోయిందని అన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసింది రియాజ్ ఒక్కడే కాదు.. అ రోజు హత్య చేస్తుండగా చోద్యం చూస్తూ ఫోటోలు తీసిన వారంతా హంతుకులే అని అన్నారు.

పోలీస్ లను చంపిన వారిని పోలీస్ పట్టుకున్నారు పనిష్మెంట్ ఇచ్చారు. పోలీస్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ప్రజలది ఏముంది.. పట్టుకోవడం లో ఏమైనా సహాయం చేశారా  అని, ఫోన్లలో స్టేటస్ లు పెట్టుకోవడం తప్ప అని అన్నారు.

ఆ రోజు హత్య జరిగంగా చోద్యం చూసిన ఓ మూర్ఖ మైన ప్రజలారా కొద్దిగా మారండి అని అన్నారు. ప్రజల తీరు మరేలా అని స్వచంధ సంస్థలు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేయాలని అన్నారు. నేరాలు అరికట్టే బాధ్యతలో పోలీస్ లకు సహాయం చేసి బాధ్యతగా మెలిగినప్పుడే ప్రమోద్ ఆత్మకు శాంతి చేకూరుతుంది అని అన్నారు. పోలీస్ కమీషనర్ సంఘటన తరువాత ప్రజలు ఇంత బాధ్యత రహితంగా ఉన్నారు. అసహనం వ్యక్తం చేయటం యావత్తు జిల్లా ప్రజలు సిగ్గుపడాలని, ఇలా జరగకుండా రాబోయే రోజుల్లో బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -