‘అంతా మీ వల్లే…’ అని ఓ హీరోయిన్ ఓ సినిమాలో కామెంట్ చేస్తుంది. ఇప్పుడదే కామెంట్ పాశ్చాత్య దేశాల్లో వినబడుతోందట. మతం, విశ్వాసాలు, పూజలు, పునస్కారాలనేవి వ్యక్తిగతమైనవి. కానీ వాటిని బహిరంగ పరిచి, రోడ్ల మీద ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అవతలి వారికి ఇబ్బందులు తప్పవు. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చదువు, ఉద్యోగాల నిమిత్తం వెళ్లే భారతీయులు… రకరకాల కార్యక్రమాలను బహిరంగంగా నిర్వహిస్తున్నారనే టాక్ వినబడుతున్నది. వీధులు, కాలనీలను దాటి ఇప్పుడీ కార్యక్రమాలు రహదారుల మీదికి కూడా వస్తున్నా యంట. ఫలితంగా అక్కడి వారు మనోళ్లను వింతగా చూస్తున్నారని వాపోతున్నారు పలువురు ప్రవాస తెలంగాణవాసులు. అక్కడి నియమ నిబంధనలకు విరుద్ధంగా, ప్రజలకు అసౌకర్యం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్న మనోళ్లు కొంచెం ఆలోచించా లంటూ వారు హితవు పలుకుతున్నారు. -కే.ఎన్.హరి
అంతా మనోళ్ల వల్లే…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES