Monday, December 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుర్తుంచుకోవడం కష్టమే.!

గుర్తుంచుకోవడం కష్టమే.!

- Advertisement -

గుబులు పుట్టిస్తున్న గుర్తులు..
నవతెలంగాణ – మల్హర్ రావు

గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తుల గుబులు పట్టుకుంది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల అధికారులు కేటాయిస్తున్న గుర్తులు ఒకే పోలికతో ఉండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు, వృద్ధులు ఆ గుర్తులను గుర్తించుకోవడం కష్టంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తండాలు, చిన్న గ్రామ పంచాయతీల్లో ఎక్కువ శాతం నిరక్షరాస్యులు ఓటర్లు ఉంటారు. ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థుల పేర్లు, ఫొటోలు ఉండవు. కేవలం గుర్తు మాత్రమే ముద్రిస్తారు. అసలే పరిమితి ఓట్లు కావడంతో ప్రతి ఓటు కీలకం కానుంది. ఈ క్రమంలో ఓట్లు తారుమారైతే.. అభ్యర్థుల భవితవ్యం ప్రమాదంలో పడుతుందనే భయం అందరినీ వెంటాడుతోంది.

సర్పంచ్ బ్యాలెట్ గుర్తులు..

ఉంగరం, కత్తెర, ఫుట్బాల్, లేడీ పర్స్, టీవీ రిమోట్, టూత్పేస్ట్, బ్యాట్, బ్యాట్స్మెన్, స్టంప్స్, పాన, చెత్తడబ్బా, బ్లాక రబ్బర్లు, బెండకాయ, కొబ్బరి తోట, డైమండ్, బకెట్, డోర్ హ్యాండిల్, చాయ్ జాలీ, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, పడవ, బిస్కెట్, వేణువు, చైన్, చెప్పులు, గాలిబుడగ వంటి గుర్తులు ఉంటాయి.

వార్డు సభ్యుల బ్యాలెట్లో ఇలా..
గౌను, గ్యాస్ స్టౌ, స్టూల్, సిలిండర్, బీరువా, ఈల, కుండ, డిష్ యాంటినా, గరాట, మూకుడు, ఐస్క్రీమ్, గాజుగ్లాస్, పోస్టుడబ్బా, కవర్, హాకీ కర్ర, బంతి, నెట్, కటింగ్ ప్లేయర్, బాక్స్, విద్యుత్ స్తంభం, కేటిల్ గుర్తులు ఉంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -