Friday, January 9, 2026
E-PAPER
Homeమానవితొక్కేకదానీ…

తొక్కేకదానీ…

- Advertisement -

నిమ్మ కాయల గురించి తెలియని వారుండరు. వీటిని రోజు వారీ జీవితంలో అనేక రకాలుగా వినియోగిస్తుంటాం. రోజువారీ ఆహారంలో నిమ్మను చేర్చుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది సహాయపడుతుందని చెబుతున్నారు. చాలా మంది తమ భోజనంలో నిమ్మ రసం కలిపి తినడానికి ఇష్టపడతారు. భోజనంలో మాత్రమే కాదు నిమ్మ జ్యూస్‌ కూడా ఎంతో ఇష్టంగా తాగుతారు. నిమ్మకాయలో అత్యధిక మొత్తంలో విటమిన్‌ సి ఉంటుంది. విటమిన్‌ సి తో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మకాయ మాత్రమే కాదు నిమ్మ తొక్క కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

నిమ్మ తొక్కలతో ఎన్నో పనులను సులువుగా చేయవచ్చు. నిమ్మ తొక్కలలో విటమిన్‌ సి, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. వాటిలో వివిధ రకాల ఫైబర్‌ కూడా ఉంటుంది. అలాగే నిమ్మ తొక్కలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. నిమ్మ తొక్క ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. నిమ్మతొక్కతో పాత్రలను శుభ్రం చేస్తే తళతళ లాడాల్సిందే. నిమ్మతొక్కలో ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్దకానికి చెక్‌ పెట్టొచ్చు. ఇది ప్రేగు అల్సర్లను కూడా నయం చేస్తుంది. ముఖ్యంగా ముఖంపై మొటిమల సమస్య నుంచి బయటపడటానికి నిమ్మ తొక్క పొడితో తయారు చేసిన ఫేస్‌ మాస్క్‌ వినియోగించ వచ్చు. ఇది మొటిమల సమస్య నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -