- – తుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పట్లోట్ల నాగిరెడ్డి
నవతెలంగాణ-మల్హర్ రావు: రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల లక్షల ఎకరాల్లో పంట, నగరాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల నివాసాలు పూర్తిగా జలమయంమైనాయని, రోడ్లు, విద్యుత్ సౌకర్యలు శిథిలమై సంబంధాలు తెగిపోయాయని ఇది ప్రకృతి విపత్తు అంటు ప్రభుత్వం తన అసమర్ధతను దాసుకోవడం సిగ్గుచేటు.ప్రభుత్వం చెప్పేన మాటలన్నీ పచ్చి బూటకం అని రైతుకూలీ సంఘం (ఆర్ సి ఎస్)తెలంగాణ రాష్ట్ర కమిటి అధ్యక్షుడు పట్లోట్ల నాగిరెడ్డి ఆరోపించారు. సోమవారం మండల కేంద్రంలో మాట్లాడారు చెరువులు,నాలాలు,కుంటలు కబ్జా చేయడం వల్ల ప్రజలు నరకంఅనుభవిస్తున్నారని తెలిపారు.అడవులను అన్యాక్రాంతం చేస్తు అంబానీ అదాని ఇతర కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేయడం వల్ల నాసిరకం నిర్మాణాలతో చెక్ డ్యాంలు, అనకట్టలు నిర్మించడం వల్ల లక్షల కోట్ల రూపాయల ప్రజలధనం నీటి పాలైపోయిందని అనడంలో సందేహం లేదన్నారు.గ్రామీణ ప్రాంతలల్లో రైతంగం యూరియా కొరతతో పంటలు కాపాడుకొనుటకు నానాయాతనాలు పడుతుంటే వరదలు పంటలను పూర్తిగా మింగేసాయి. వరి పొలాల్లో పంట చెల్లళ్ళో ఇసుక మెటలు వేసి రైతును కుదెలును చేసాయి.
కార్పొరేట్ సంస్థల లాభలకోసం వారు వేసే ఎంగిలి మెతుకుల కోసం ప్రభుత్వాలు ప్రజాద్రోహం చేస్తున్నాయని తెలిపారు.వరదలపై సమీక్షా జరుపుతాం ప్రజలకు నష్టపరిహారం ఇస్తాం అనిచెప్పే ప్రభుత్వ వాగ్దానాలాన్ని మరొకసారి ప్రజలను వంచించాడానికే అనేది నిజమన్నారు.ప్రజలకు నష్ట పరిహారం చెల్లింపుల పేర భారీ మొత్తంలో స్కాం చేయడానికి అధికార యంత్రాంగం కుయుక్తులు పన్నుతుందన్నారు.
వరదల్లో నష్టపోయిన పజలకు ఇల్లు, తాగునీరు, రోడ్లు సౌకర్యలను యుద్ధప్రతిపాధికానా అందించాలని డిమాండ్ చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో ఆహార, వాణిజ్య పంటల నష్టాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వరి ఎకరకు రూ.50 వేలు వాణిజ్య పంటలైన మిర్చి, పత్తి, పెసర, కంది, పల్లి, ఇతర పంటలకు ఎకరాకు లక్ష రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వల సమన్వయం లోపం, అతి నిర్లక్షం వల్లే తెలంగాణలో రైతంగం యూరియా కొరత ఎదుర్కొంటుందన్నారు. ఖరీఫ్ లో రాష్ట్రనికి 9.80లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తేదీ 31-8-2025 వరకు సరఫరా చేయాలి. కాని కేవలం 5.42లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా కావడం అందులో అధికభాగం ప్రైవేట్ సంస్థలకు వెళ్లడం వల్ల పంట రక్షణకోసం అన్నదాత అధికారుల కాళ్ళు మొక్కే దుస్థితి రాష్ట్రంలో నెలకొనడం విచారించవలసిన విషయమన్నారు.ఆర్ఏప్ సిఎల్ సాంకేతిక లోపాన్ని సాకుచూపుతూ యూరియా సరఫరా పై కళ్ళబోళ్లి మాటలు చెప్పుతున్నారు.తక్షణమే యూరియాను సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని, ప్రైవేట్ సంస్థల్లో జరుతున్న అక్రమ విక్రయాలను, కల్తీ వితనాలను అరికట్టి తగుచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వరద నష్టలపై, యూరియా సరఫరా లోపలపై ప్రభుత్వం స్పందించని యెడల రాష్ట్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్తురు సదానందం,కోశాధికారి గునిగంటి వెంకటేశ్వర్ రావు,రాష్ట్ర కమిటి సభ్యుడు చందా నరేందర్,ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు యుగంధర్ గౌడ్ పాల్గొన్నారు.