Friday, October 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అది సీజే పై కాదు.. దేశంపై దాడి.!

అది సీజే పై కాదు.. దేశంపై దాడి.!

- Advertisement -

నిందితున్ని వెంటనే అరెస్టు చేయాలి – ముక్కపల్లి రాజు మాదిగ
నవతెలంగాణ – దుబ్బాక 

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి పై దాడి చేసిన నిందితున్ని వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ముక్కపల్లి రాజు మాదిగ డిమాండ్ చేశారు. అది సీజే పై జరిగిన దాడి కాదని దేశం పై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు సీజే పై దాడిని నిరసిస్తూ శుక్రవారం దుబ్బాక ఐఓసీ లోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. బాధ్యుల్ని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ తహసీల్దార్ సంజీవ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. వీహెచ్ పీఎస్ జిల్లా అధ్యక్షులు ముక్కపల్లి కనకరాజు, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు ఇస్తారీగల్లా ఎల్లం, దొమ్మాట జోగయ్య, చెక్కపల్లి మహేష్, జనగామ విజయ్, బెల్లే రమేష్, పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -