Friday, January 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇక అఫీషియల్‌…

ఇక అఫీషియల్‌…

- Advertisement -

ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగిన అమెరికా
బాధ్యతారాహిత్య చర్య అని నిపుణుల విమర్శ

వాషింగ్టన్‌ : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి అమెరికా గురువారం అధికారికంగా వైదొలిగింది. దాని నుంచి తప్పుకుంటున్నానని సంవత్సరం క్రితమే అమెరికా నోటీసు ఇచ్చింది. దీంతో నిబంధనల ప్రకారం ఇప్పుడు అది అధికారిక నిష్క్రమణ అయిందని చైనా సెంట్రల్‌ టెలివిజన్‌ (సీసీటీవీ) తెలిపింది. డబ్ల్యూహెచ్‌ఓ నుంచి తప్పుకుంటున్నామని ప్రకటిస్తూ గత సంవత్సరం జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కార్యనిర్వాహక ఆదేశంపై సంతకం చేశారు. ఆ తర్వాత రెండు రోజులకు ఐక్యరాజ్యసమితికి ఆ నోటిఫికేషన్‌ అందింది. ఐరాస ఛార్టర్‌ ప్రకారం నోటీసును సమర్పించిన సంవత్సరం తర్వాతే సభ్య దేశం నిర్ణయం అమలులోకి వస్తుందని సిన్హువా వార్తా సంస్థ తెలియజేసింది. అమెరికా నిర్ణయంపై డబ్ల్యూహెచ్‌ఓ విచారం వ్యక్తం చేసింది.

సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రాస్‌ గేబ్రియేసస్‌ ఈ నెల 13న ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఈ చర్య అమెరికాను, ప్రపంచాన్ని ఆరోగ్య పరంగా అభద్రతలోకి నెడుతుందని తెలిపారు. ఇది సరైన నిర్ణయం కాదని ఆయన చెప్పారు. నిబంధనల ప్రకారం అమెరికా సంవత్సరం ముందే నోటీసు ఇచ్చినప్పటికీ ఆర్థిక బకాయిలను చెల్లించలేదని డబ్ల్యూహెచ్‌ఓ అధికారులు తెలియజేశారు. 2024-25లో అమెరికా 278 మిలియన్‌ డాలర్లు బకాయి పడిందని అన్నారు. డబ్ల్యుహెచ్‌ఓ నుంచి వైదొలిగిన నేపథ్యంలో… ప్రపంచంలో ఎక్కడైనా ముఖ్యమైన ఇన్‌ఫెక్షన్‌ వ్యాధులు సోకినప్పుడు వాటిని నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలను సమన్వయం చేసుకునేందుకు, ఆ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు అమెరికాకు కష్టమవుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఒకవేళ అలాంటి పరిస్థితి అమెరికాలోనే ఎదురైతే డబ్ల్యూహెచ్‌ఓ ద్వారా ఆ సమాచారాన్ని ప్రపంచ దేశాలతో పంచుకునే అవకాశాన్ని ఆ దేశం కోల్పోతుందని, ఫలితంగా ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. అమెరికా నిర్ణయం బాధ్యతారాహిత్యమని వారు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -