Tuesday, January 27, 2026
E-PAPER
Homeజాతీయంధనవంతుల కోసమే..

ధనవంతుల కోసమే..

- Advertisement -

యూరప్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
లగ్జరీ కార్లపై భారీగా సుంకాలు తగ్గింపు


న్యూఢిల్లీ : ధనవంతుల ఆసక్తుల కోసం యూరోపియన్‌ యూనియన్‌ (ఇయు)తో భారత్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి వెంపర్లాడుతోంది. లగ్జరీ కార్ల టారిఫ్‌లపై భారీగా సుంకాలను తగ్గించడానికి మోడీ సర్కార్‌ అంగీకరించినట్లు రిపోర్టులు వస్తోన్నాయి. దీనికి సంబంధించిన కీలక ప్రతిపాదనలు సిద్దం అవుతోన్నాయని రిపోర్టులు వస్తోన్నాయి. ఇయు నుంచి దిగుమతి అవుతున్న ఆ కార్లపై ప్రస్తుతం 110 శాతంగా ఉన్న టారిఫ్‌లు 40 శాతానికి తగ్గించేందుకు కేంద్రం అంగీకరించింది. 15వేల యూరోల (దాదాపు రూ.16 లక్షలు) కంటే ఎక్కువ ధర ఉన్నవాటికి ఈ వెసులుబాటు కల్పించనుంది.

భవిష్యతులో ఈ సుంకాలు మరింత తగ్గొచ్చని అంచనా. టారిఫ్‌లను భారీగా తగ్గించే వోక్స్‌వ్యాగన్‌, మెర్సిడజ్‌ బెస్‌, బిఎండబ్ల్యు వంటి యూరప్‌ లగ్జరీ కార్లు భారత మార్కెట్లో మరింత అమ్మకాలను పెంచుకోనున్నాయి. భారత్‌, ఇయు మధ్య ఒప్పందం దిశగా ఇంకా చేయాల్సిన పని ఉందని ఇటీవల ఇయు అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్‌ లేయెన్‌ పేర్కొన్నారు. తాము చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దశలో ఉన్నామన్నారు. కొందరు దీనిని మదర్‌ ఆఫ్‌ ఆల్‌ డీల్స్‌గా పిలుస్తున్నారన్నారు. దీనివల్ల కోట్లాది మంది ప్రజలకు వస్తువులు, సేవలు ఎగుమతి, దిగుమతి చేసుకొనే సౌలభ్యం కలుగుతుందన్నారు. ప్రస్తుతం ఉర్సులా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ప్రస్తుత పర్యటనలోనే భారత్‌, ఇయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కీలక అంగీకారం జరగొచ్చని తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -