– అపన్న హస్తం కోసం ఎదురుచూపులు
నవతెలంగాణ – ఆర్మూర్
రెండు కిడ్నీలు చెడిపోయి కడు దయనీయ పరిస్థితిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పట్టణంలో నివసిస్తున్న కళ్యాణి శనివారం తెలిపారు. తన భర్తదే దావత్ శాంతి లాల్ రెండు కిడ్నీలు చెడిపోయినాయని, గత రెండు సంవత్సరాల నుండి హాస్పిటల్కు వెళ్తున్నట్టు, హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ లో చూపించినట్టు దాదాపుగా ఇప్పటివరకు ఐదు లక్షల వరకు ఖర్చు అయినట్టు తెలిపారు.
కేవలం 15 వేల జీతంతో పట్టణ హెడ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ఎందు కాంట్రాక్టు బేసిక్ గా పనిచేస్తున్నానని, ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు అమ్మ, అన్న చనిపోయినట్టు, ఆరు సంవత్సరాల బాబు ఉన్నట్టు, ఎటువంటి ఆధారం లేదని, ప్రస్తుతం పట్టణ ఏరియా ఆసుపత్రి యందు ఒకరోజు తప్పించి ఒకరోజు డయాలసిస్ చేస్తున్నారని, దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహకరించాలని, 9121744642 ఫోన్ పే నంబర్ కు సహాయం అందించి ఆదుకోవాలని కోరినారు.