Saturday, December 27, 2025
E-PAPER
Homeసినిమా'రాజు గారి పెళ్లిరో..'

‘రాజు గారి పెళ్లిరో..’

- Advertisement -

హీరో నవీన్‌ పొలిశెట్టి నటిస్తున్న తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన మొదటి గీతం ‘భీమవరం బాల్మా’ ఆకట్టుకుంది. లేటెస్ట్‌గా ఈ చిత్రం నుంచి రెండవ గీతంగా ‘రాజు గారి పెళ్లిరో’ విడుదలైంది. మాస్‌తో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉత్సాహభరితంగా సాగిన ఈ గీతం.. సంక్రాంతి పండగ వాతావరణాన్ని ముందే తీసుకొని వచ్చింది. తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయే పెళ్లి పాటలలో ఒకటిగా ఇది నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ పాటలో నవీన్‌ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ సమకూర్చిన అద్భుతమైన నత్య రీతులతో ఈ పాటను భారీ స్థాయిలో తెరకెక్కించారు. ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి, సమీరా భారద్వాజ్‌ ఆలపించగా, చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. మిక్కీ జె. మేయర్‌ సమకూర్చిన సంగీతం ఈ పాటను పండగ గీతంగా మలిచింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్‌ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న భారీ స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది అని చిత్రయూనిట్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -