Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeదర్వాజనేటి కాలానికి అవసరమైనది జాబేర్ కవిత్వం

నేటి కాలానికి అవసరమైనది జాబేర్ కవిత్వం

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: ఇదీ గల్ఫ్ బతుకుల అవస్థ. పాషా రాసిన ప్రేమ కవిత్వం, ప్రకృతి కవిత్వం, యుద్ధం మీద రాసిన కవిత్వం, మానవ సంబంధాల కవిత్వం, విప్లవోద్యమాల మీద రాసిన కవిత్వం, సమకాలీన ఘటనల మీద రాసిన కవిత్వం ఇది అని ప్రముఖ కవి, విమర్శకులు జి.లక్ష్మీనరసయ్య అన్నారు. తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.ఆనందాచారి అధ్యక్షతన జరిగిన యువకవి జాబేర్ పాషా కవితా సంపుటి “అగరు ధూపం- ఊదు పొగ ” ను లక్ష్మీ నరసయ్య ఆవిష్కరించారు.‌ ఆనందాచారి మాట్లాడుతూ దేశం కాని దేశంలో ఉంటూ కూడా కవిత్వాన్ని రాయడం, అందునా తనదైన బతుకు పరిమాళాన్నీ , పరిభాషనీ తీసుకురావడం గొప్ప విషయమన్నారు.
కవిసంగమం నుంచి ఇలాంటి మంచి పుస్తకాన్ని ప్రచురించడం ఆనందాన్ని కలిగిస్తుందని కవి యాకూబ్ అన్నారు. హిందూ ముస్లిముల ఆలాయ్ బలాయ్ కవిత్వం, వలస జీవులు వేదన ఇందులో ఉందని తెలిపారు. ప్రముఖ కవయిత్రి నాంపల్లి సుజాత మాట్లాడుతూ నా విద్యార్థి నేడు ఒక మంచి కవిగా గుర్తింపు తెచ్చుకోవడం గురువుగా నాకు గర్వంగా ఉందని చెప్పారు. ఈ సభలో యువ కవులు నాగిళ్ల రమేష్, తగుళ్ల గోపాల్, అనంతోజు మోహన్ కృష్ణ, కవి జాబేర్ పాషా, అతని కుటుంబ సభ్యులు, కవులు, రచయితలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img