ఉద్యోగుల సమస్యలపై చర్చ
నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ ఎంప్లాయిస్ చేసి జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అధ్యక్షతన సోమవారం నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు రేకులపల్లి భూపతి రెడ్డి ని వారి క్యాంపు కార్యాలయంలో టీఎన్జీవోస్ పక్షాన మర్యాదపూర్వకంగా కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యలను ప్రభుత్వ అధికారులతో సమన్వయపరచుకొని త్వరలో పరిష్కరించుటకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కి టి ఎన్ జి ఓ ఎస్ అధ్యక్ష కార్యదర్శుల బృందం కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టీఎన్జీవో కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా జాయింట్ సెక్రెటరీ జాఫర్ హుస్సేన్, టిఎన్జీవో నిజాంబాద్ అర్బన్ యూనిట్ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన జేఏసీ ఎంప్లాయిస్
- Advertisement -
- Advertisement -



