నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమావేశం జరిగింది. ఇందులో ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూని యన్, ఎస్‌డబ్ల్యూఎఫ్, బహుజన కార్మిక యూనియన్, బహుజన వర్కర్స్ యూనియన్, కార్మిక పరిషత్ తదితర ఆర్టీసీ సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ సంస్థ పరిరక్షణ కోసం ఆరు సంఘాలు జేఏసీగా ఏర్పడడానికి నిర్ణయించినట్టు కొత్త కమిటీ నాయకులు తెలిపారు. నూతన కమిటీ చైర్మెన్‌గా ఎంప్లాయి స్‌యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న, వైస్ చైర్మెన్‌గా టీఎంయూ ప్రధానకార్యదర్శి ఎం థామస్‌రెడ్డి, కన్వీనర్‌గా ఎన్‌ఎం యూ ప్రధానకార్యదర్శి ఎండి మౌలానా తదితరులతో కమటీ ఏర్పాటు అయినట్టు వివరించారు.
మాకు సంబంధం లేదు: కమాల్‌రెడ్డి
ఆర్టీసీ కార్మికుల సమస్యలపైన ఎంప్లాయిస్ యూనియన్ ఆఫీసులో జరిగిన సమావేశం మేరకు ఆర్టీసీ జేఏసీ ఏర్పాటు చేసినట్టుగా వస్తున్న వార్తలకు నాకు సంబంధం లేదనిఎన్‌ఎంయూ అధ్యక్షులు పి. కమాల్‌రెడ్డి తెలిపారు. మా రాష్ట్ర సంఘంలో ఎలాంటి జేఏసీ విషయంలో ఎలాంటి నిర్ణయం జరగలేదని వివరించారు.
ఆర్టీసీలో జేఏసీ ఏర్పాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



