Tuesday, February 3, 2026
E-PAPER
Homeఆటలుజగదీశన్‌ సెంచరీ

జగదీశన్‌ సెంచరీ

- Advertisement -

యుఎస్‌ఏపై భారత్‌-ఏ గెలుపు

ముంబయి : నారాయణ్‌ జగదీశన్‌ (104, 55 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగాడు. ఆయుశ్‌ బదోని (66 నాటౌట్‌, 26 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీతో దంచికొట్టగా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచ్‌లో యుఎస్‌ఏపై భారత్‌-ఏ ఘన విజయం సాధించింది. జగదీశన్‌, ఆయుశ్‌ బదోని మెరుపులతో భారత్‌-ఏ తొలుత 20 ఓవర్లలో 238/3 పరుగుల భారీ స్కోరు చేసింది. గాయం నుంచి కోలుకున్న తిలక్‌ వర్మ (38, 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రియాన్షు ఆర్య (28) రాణించారు. భారీ ఛేదనలో యుఎస్‌ఏ 19.4 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. భారత్‌-ఏ బౌలర్లలో రవి బిష్ణోయ్ (3/37), ఖలీల్‌ అహ్మద్‌ (2/25), నమన్‌ ధిర్‌ (2/6) రాణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -