నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌రావు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పూలమాలవేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడ్డ విషయాలను వారు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పట్ల శశిధర్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఉపేందర్, కె కిషోర్‌గౌడ్, జెడ్పీ మాజీ చైర్మెన్ తుల ఉమ, మహిళా నాయకురాలు సుమిత్ర, బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు, విద్యార్థి నాయకులు హరిబాబు, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్‌లో జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



