నవతెలంగాణ- మిడ్జిల్
మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాలలో అణగారిన వర్గాల నాయకుడు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలేసి నివాళులు అర్పంచారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. దళిత సామాజిక వర్గానికి చెందిన జగ్జీవన్ రావ్ ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, పేద ప్రజల కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు.
దళితుల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ప్రజా సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అల్వాల్ రెడ్డి, బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, బిజెపి మండల అధ్యక్షులు నరేష్ నాయక్, ప్రజా సంఘాల నాయకులు బాలయ్య, దేవయ్య, వెంకటయ్య, విజయ్ కుమార్, రాజేశ్వర్, భీమ్ రాజ్, నరేష్ , వెంకటేష్ గౌడ్, మంగలి రమేష్, మహేష్, నారాయణ, శివకుమార్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.



