Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాగృతి వర్సెస్ ఎస్పిఎఫ్ సిబ్బంది..

జాగృతి వర్సెస్ ఎస్పిఎఫ్ సిబ్బంది..

- Advertisement -

కొండపైకి తమ కార్లు అనుమతించాలని జాగృతి కార్యకర్తలు
5 వాహనాలకు అనుమతి ఉందన్న ఎస్పీఎఫ్ సిబ్బంది
పది నిమిషాలు పార్కింగ్ ఆగిన కవిత కారు
నవతెలంగాణ – యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దర్శనానికి గురువారం ఎమ్మెల్సీ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత రావడంతో కొండ కింద పార్కింగ్ వద్ద ఎస్పిఎఫ్ సిబ్బందికి జాగృతి కార్యకర్తలకు స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. కవిత వెంట వచ్చిన కాన్వయ్ ని మొత్తం కొండపైకి అనుమతించాలని జాగృతి కార్యకర్తలు డిమాండ్ చేశారు. అన్ని కార్లకు అనుమతి లేదని, ఎమ్మెల్సీతో పాటు ఐదు కార్ల కు అనుమతిస్తామని ఎస్పీఎఫ్ సిబ్బంది వివరించారు. కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. చివరికి పై అధికారుల ఆదేశం మేరకు సుమారు పది కార్ల వరకు పైకి పంపారు. మిగతా కార్లకు రూ.500 రుసుము తీసుకొని పైకి వెళ్ళనిచ్చారు. పోలీసులకు ఎస్పీవై సిబ్బందికి వాగ్వాదం జరుగుతున్న కవిత కారు లోనే కూర్చుండిపోయారు. సుమారు పది నిమిషాలు పార్కింగ్ వద్ద ఆమె కారులోనే ఉండవలసి వచ్చింది అనంతరంపై అధికారుల సూచన మేరకు ఐదు కార్ల ను కొండపై అనుమతించడంతో గొడవ సద్దుమణిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -