నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీసీ జేఏసీ బంద్‌కు తెలంగాణ జాగృతి మద్దతు తెలిపింది. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి బీసీ జేఏసీ చైర్మెన్ ఆర్.కృష్ణయ్య, వైస్ చైర్మెన్ వీజీఆర్ నారగోని, జాతీయ బీసీ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, బీసీ జేఏసీ నాయకులు వెళ్లి బంద్‌కు మద్దతివ్వాలని కోరారు. దీంతో బంద్‌కు సంపూర్ణ మద్ధతిస్తున్నట్టు జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశం లో కవిత మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మభ్య పెడుతున్నాయని విమర్శించారు. నేటి బంద్‌లో జాగృతి కార్యకర్తలు ఎక్కడికక్కడ పాల్గొంటారని తెలిపారు.
బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంటు లో చట్టం చేసే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. వీజీఆర్ నారగోని మాట్లాడుతూ కవిత మాదిరిగా బీసీలకు మద్ధతు అగ్రవర్ణాల నాయకులు మాట్లాడాలని కోరారు. బంద్ కు మద్ధతిచ్చినందుకు కవితకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల గురించి పోరాడుతున్న కవిత అభినందనీయురాలనీ, ఆమెను బీసీలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలంగాణలో మొదలైన బీసీ ఉద్యమం అన్ని రాష్ట్రాలకు విస్తరించాలని ఆకాంక్షించారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
బీసీ జేఏసీ బంద్‌కు జాగృతి మద్దతు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES