- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జగిత్యాల నుండి 35 మంది ప్రయాణికులతో ముంబై వెళ్లిన వీనస్ ట్రావెల్స్ బస్సు షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దహనమైంది. ప్రయాణికులను గమ్యస్థానంలో దింపి, పార్కింగ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే బస్సు కాలిబూడిదైంది. ప్రయాణికులు అప్పటికే బస్సు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
- Advertisement -



