మాజీ ఎంపిపి ఇమ్మడి గోపి మృత్తి పట్ల సంతాప సభ
నవతెలంగాణ – దర్పల్లి
ఇటీవల ఇందల్వాయి మండలానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ అయిన ఇమ్మడి గోపి ముదిరాజ్ మృతికి గాను సంతాప సభను మంగళవారం మండలంలోని సీతాయిపేట గ్రామ ముదిరాజ్ కులస్థులు ఘనంగా నిర్వహించారు . ఇటీవల గౌరారం సమీపంలో జరిగిన దాడిలో మృతి చెందిన ప్రాంతంలో విషాదం నెలకొంది.
ఈసందర్బంగా సీతాయిపేట ముదిరాజ్ కులస్థులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మృత్తుని కులస్థులు, అభిమానులు, జై ముదిరాజ్ చలో సీతాయిపోట్ అనే నినాదాంతో ఏర్పాటు చేసిన సంతాప సభలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ముదిరాజ్ సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపి సేవలను స్మరించుకుంటూ పలువురు నేతలు నివాళులర్పించారు. గ్రామ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని కొనియాడారు.
సభలో పాల్గొన్నవారు రెండు నిమిషాల మౌనం పాటించి, గోపి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ముదిరాజ్ సంఘాల నాయకులు మాట్లాడుతూ, గోపి హత్యపై పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఆయన కుటుంబానికి ప్రభుత్వం తగిన సహాయం అందించాలని కోరారు.



