సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి రాష్ట్రానికి, దేశానికి అందించిన సేవలు మరువలేనివని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా పార్లమెంటులో ఆయన కీలకభూమిక పోషించారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను కేంద్రానికి వివరించడంలో ఆయన సఫలీకృతుడయ్యారని కొనియాడారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా జైపాల్‌రెడ్డి చూపిన బాట స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లోని పీవీ మార్గ్ వద్ద ఉన్న స్ఫూర్తిస్థల్‌లో జైపాల్‌రెడ్డి 84వ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని జైపాల్‌రెడ్డి సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులతో కరచాలనం చేశారు. జైపాల్‌రెడ్డి కార్యదక్షుడనీ, పార్లమెంటులో తన గళాన్ని గొప్పగా వినిపించేవారని సీఎం గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ, హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనవాస్‌రెడ్డి, పార్లమెంటు సభ్యులు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు సురేష్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి ఓఎస్డీ వెంకట్రామ్‌రెడ్డి మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్రానికి, దేశానికి జైపాల్‌రెడ్డి సేవలు మరువలేనివి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



