– హెచ్‌ఎండీఏ కమిషనర్ ఆతిథ్యం
– మాస్టర్ ప్లాన్, డిజిటలైజేషన్, ల్యాండ్ పూలింగ్‌పై జేడీఏకు వివరణ
– హెచ్‌ఎండీఏ అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేసిన జేడీఏ
నవతెలంగాణ-హైదరాబాద్ (హెచ్‌ఎమ్‌డీఏ)
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎమ్‌డీఏ) ప్రణాళికా చర్యలను అధ్యయనం చేయడానికి జైపూర్ డెవలప్‌మెంట్ అథారిటీ జేడీఏ ప్రతినిధి బృందం శుక్రవారం కార్యాలయాన్ని సందర్శించింది. జైపూర్ డెవలప్‌మెంట్ అథారిటీ (జేడీఏ) కమిషనర్ ఆనంది నేతృత్వంలో ప్లానింగ్ డైరెక్టర్ ప్రీతిగుప్తా, అదనపు చీఫ్ టౌన్ ప్లానర్ అంకుర్ దధీచ్, అసిస్టెంట్ టౌన్ ప్లానర్ రుషికేష్ కొల్టే హాజరయ్యారు. వీరికి అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయంలో మెట్రో పాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఇతర సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హెచ్‌ఎండీఏ అభివృద్ధిపై సర్ఫరాజ్ అహ్మద్ సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుత మాస్టర్ ప్లాన్లు, రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్లు, ల్యాండ్ పూలింగ్ పథకాలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతం 2050 కోసం రూపొందించిన సమగ్ర మాస్టర్‌ప్లాన్‌ను వివరించారు. ఇందులో కాంప్రెహెన్సివ్ మొబిలిటీ ప్లాన్, ఆర్థికాభివృద్ధి ప్రణాళిక, బ్లూ-గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్‌లను ఏకీకృతంగా కలిపింది. హెచ్‌ఎండీఏ ఆధారిత బేస్ మ్యాప్ ద్వారా మొత్తం మెట్రోపాలిటన్ ప్రాంతానికి ఆధారభూతంగా పని చేస్తున్నదని కమిషనర్ వివరించారు. తెలంగాణలో ముఖ్యమైన పట్టణ ప్రాంతం కోసం 3డీ డిజిటల్ ట్విన్ అభివృద్ధి, అలాగే కొత్త కాంప్రెహెన్సివ్ బిల్డింగ్ రెగ్యులేషన్స్ రూపకల్పనలో ఉన్నట్టు తెలియజేశారు. ఇలాంటి పరస్పర సంస్థల మధ్య పరస్పర విజ్ఞాన మార్పిడి, విజయవంతమైన నమూనాలను అనుసరించడం, ప్రజలకే కేంద్రంగా ఉన్న పట్టణ పాలనను ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో ప్రయోజనం ఉంటుందని సర్ఫరాజ్ అహ్మద్ వివరించారు. అనంతరం హెచ్‌ఎండీఏ దూరదృష్టి ప్రణాళిక, సాంకేతిక చర్యలను జేడీఏ ప్రతినిధులు కొనియాడారు. కమిషనర్ ఇచ్చిన వివరాలపై కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో హెచ్‌ఎండీఏ సభ్యులు(ప్లానర్) ఎస్.దేవేందర్‌రెడ్డి, ప్లానింగ్ డైరెక్టర్లు కె.విద్యాధర్, ఎం.రాజేంద్ర ప్రసాదనాయక్, పలువురు టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.
హెచ్‌ఎండీఏను సందర్శించిన జైపూర్ కమిషనర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES