- Advertisement -
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, భారత్‌లో ఆ దేశ దౌత్యవేత్త సెర్గియో గోర్‌తో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య భద్రత, వాణిజ్యం, సంక్లిష్ట సాంకేతికత రంగాల్లో సహకారం వంటి అంశాలు పురోగతి సాధించేలా చర్చలు జరిగనట్లు జైశంకర్, గోర్ సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కీలక దశలో ఉన్న వేళ ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకొంది.
- Advertisement -



